|రమ ప్రయాణం

-- గీత, వికారాబాద్....



కోక్కురో... కో... అని కోడి కూస్తుంది. అరికాల్లాల కెంచి సల్లాగ గాలి వస్తుంది. దుప్పటి ముడుచుకొని ఎచ్చగా నిద్రలో హాయిగా ఇంకా జెరసేపు పండుకోవాలని ఉంది..


అప్పుడే అమ్మ లేచి కిట్టుకున్న సప్పుడొచే శిలుకు ఆ తలుపు తెరిసింది. బయటకి చూస్తూ మబ్బుల్లాల్లి కెంచి రమను ఎక్కిరిస్తు రమ కంటే ముందు అన్నట్లుగా సూర్యుడు ఉదయిస్తుండు.


కిర్ర... కిర్ర... సప్పుడు చేసుకుంటూ అమ్మ అకిటుడ్చి పోయేసరికి బరగిర సమాను కడిగి బువ్వ కూర వండింది.


రమ లెచి దాబి దాటి నెబైలుకు పోయేటచ్చి మెల్లగా ఇసుకులు బస్త ముంగటెసుకొని నిన్న సా|| బస్సు రాక ముందు బస్టాండ్ లో చేసిన ఓం వర్లో ఇంకా రెండు పేజీలు పూర్తి చేసి పుస్తకాలని బస్తాలో సర్ది పడుకుంటుంది.


ఆగం ఆగం మీద బువ 01 తిని ఆత్రం మీద బ్యారేసికొని చెప్పులు తొడుకొని పరుగు పరుగున వూరు దాటేసరికి పీష్... పీష్... అని తొలుత బస్ పోవట్లేటి కాలాలో ఆంపెరిగింది. గెట్ దాకా దమ్ముఒడి నడిచెటంకల పీ.......... పీ........ అని రొండో బస్ పోవట్టే గేట్ మీదికి కోచి యాపచెట్టు కింద బ్యాగ్ పెట్టి బస్ కోసం ఎదురు చూస్తుంటే...


.......... పిప్... అని 3 బస్సు రావట్టె ఎక్కుదాము అంటే కాలు వెటనికే సందులేకుండా నిండిందాయో...


దాని వెంట బస్సు వికారాబాద్ పోయోటంకెల్లా 10 అయితుంది. ఇసుకులు కాడికి వురికెటికల్ల ఫస్ట్ పిరయోడ్ అయి పోయింది 2వ పిరియడ్ మొత్తం పనిష్మెంట్ ఆయే.


ఇట్ల పొద్దుగాల తిప్పలు పడి ఇసుకులుకు పోవాలె మళ్ల 4.30 కి లాంగ్ బెల్ మొగుతుంది. పుస్తకాలు అన్ని సర్దుకొని పేయిర్ పూర్తి చేసుకొని ఆత్రం... ఆత్రం బస్టాండ్ కు పోతుండంగానే 4.40 బస్ పోవట్టె బస్టాండ్ ఆవరణలో మామిడి చెట్టుకింద దోర్లాలతో కలిసి ఆడుతుండంగా దూరం కించి మెల్లగా బస్సు కోసం వస్తున్న టిచర్లను చూసి సప్పుడుంగా దోస్తలందరం కలిసి పుస్తకాలు ముంగటేసుకొని ఓం వర్క్ చేసుకుంటున్నం. అంతలోనే డిపో నుండి ఖాళీగా వస్తున్న బస్సును చూసి ఇది 5 గం|| బస్సె అని ఇసకులు బ్యాగ్ భుజాన కేసుకున్నాము.


బస్ వచ్చి ఆగింది. కండక్టరు బోడ్ చేతులో పట్టుకోగానే ఏ వూరి బస్సు అని... చూస్తున్న సదాశివపేట బోడ్... ఎయంగానే పరుగు పందెం పోటి కంటే స్పిడ్ గా ఉరికి జనాల మధ్యలో కెంచి సందులాల్లి కెంచి శాన కష్ట పడి బస్ ఎక్కి సిట్ మీద బ్యాగు ఎత్తేసింది రమ.


మెల్లగా శ్వాస తీసుకుంటుంటే బస్ పోతుంది కెంచి కండక్టర్ వచ్చి పాస్ అడిగిండు చూపించి రమ మళీ వూరి గేట్ వరకు ప్రయాణం చేసింది. బస్ దిగేసరికి గుమిగూడిన జనాలు వున్నారు. .... ఏమయిందాని more తోసుకొని తోసుకొని ముంగటికి పోయి చూస్తే 4.30కి వచ్చిన బస్సు ఎక్కిన కాలేజి అక్క తన కూడి కాలు పట్టుకొని ఎడుస్తుంది. ఆమె కాలు మిది కెంచి బస్ పయ్య పోయింది. అందరు అనుకుంటుంటారు డమ్ -వరనకు అద్దంలో కెంచి కనిపియ్యనంత మంది ఎక్కిండు జెనాలు ఎక్కువగా ఎక్కుతుంటే డయివరెం చేస్తాడు. ఎక్కువ బస్సులు నడిపియ్యాలని సర్కారోళ్లకు చెపిన వినరాయ్యే. ఏం చేయాలే సదువుకు పోయ్యే పిల్లలకు కష్టం అయితుందని పెద్దలు మాట్లాడుకుంటారు.


కాలేజి అక్క కాలు కోసం ఆలోచిస్తూ ఇంటికి పోయింది రమ.


పుస్తకాల బస్తాను తలుపుకాడేసి ఆట కోసం ఉరుకుతుంటే దూరం కేంచి రమ.... రమ.... అని పిలుస్తుందు ఓవరప్ప అని చూస్తుంటే వినిపించి అమ్మేస్తుంది.


దగ్గరికి పోయిన ఆకిట్ల కట్టెలమోపేసింది. రమను దగ్గరికి తీసుకొని గట్టిగా హతుకొని పక్కింటి లచ్చవ తోటి గా కొనింటి మణ్యమ్మ బిడ్డ కాలు విరిగిందంట బస్సు పయ్య పోయిందంట మల్లమ్మ ఎడుసుకుంట పోయింది అని చెప్పుకుంట.


ఏ కాయ కష్టమన్న చేసుకుంటేని బతుకుతరమ్మ సదువద్దు ఎమో నా పిల్లను ఇసుకులుకు తొలియ్యా అనంగానే రమ గుండెలో బాంబ్ పేలింది.